నవ యువ భారతం నేడు ఎందుకో మానవ కుట్రలకు బలవుతుంది. ఎక్కడ చూసినా కులం మతం జాతి అంటూ కల్లోహలతొ దేశం సతమతమవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టిన బడాబాబులు. రాజకీయ పార్టీల మాటల వల్లో పడి చితికిపోయిన ఎందరో అభాగ్యులు.
దేశ ప్రగతి చాటడానికి జాతీయ గీతాన్ని ఆలపించి , దేశ బాగుకై ప్రతిజ్ఞలో భాగంగా భారతీయులు నా సోదరి సోదరులు అంటూ ప్రతిజ్ఞ చేస్తారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కులం తక్కువ అనే నేపంతో మనలాంటి మరో మనిషిని కులం పేరుతో దూశీస్తున్నాం.
వెనుక పడిన తెగలను ప్రగతి పథంలో ముందుకు తీసుకురావాలని మహనీయుడు డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ గారు వారికి అన్నింటిలో సమాన హక్కులు కల్పించడం జరిగింది. కాలానికి అనుగుణంగా దానిని అర్దిక రీత్యా సడలింపు చేయండి అని అన్నారు.
కానీ నేడు దేశంలోని యువతకు రాజ్యాంగం అంబేద్కర్ విగ్రహంలోని పుస్తకంగా మాత్రమే పరిచయం. నేడు ఆ మహానీయుడు మరలా జన్మించి రాజ్యాంగం మతం , కులం , జాతి , వర్ణ వ్యవస్థ విభేదాల కోసం కాదు రాజ్యాంగం వ్రాయబడింది కాదని చెప్పడానికి ఎంత కష్టపడెవారో ……
©️AKASHRAJ